బెంగుళూరు: భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్.. 9 నెలల తర్వాత స్పేస్ స్టేషన్ నుంచి భూమ్మీకి ఇవాళ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మెన్(ISRO Chairman) వీ నారాయణన్ స్పందించారు. సురక్షితంగా నేలపై దిగిన సునీతాకు ఆయన వెల్కమ్ పలికారు. ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు. నాసా, స్సేస్ఎక్స్ పనితీరుకు ఇదో సవాల్ అని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలపై కట్టుబడి ఉన్న అమెరికా కమిట్మెంట్కు ఇదో పరీక్షలాంటిందన్నారు. ఇస్రోకు చెందిన ఎక్స్ అకౌంట్లో నారాయణన్ స్పందించారు.
అంతరిక్ష పరిశోధనల్లో సునీతా విలియమ్స్ అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు. మీ దీక్ష, పట్టుదల.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధకులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఇస్రో చైర్మెన్‌గా, భారత అంతరిక్ష శాఖ అధిపతిగా .. గ్రీటింగ్స్ చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోందని, ఈ నేపథ్యంలో మీ అనుభవాలను స్పేస్ కార్యక్రమాలకు వాడుకోవాలని ఆశిస్తున్నామని ఇస్రో చైర్మెన్ తెలిపారు.
నాసా ఆస్ట్రోనాట్స్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇవాళ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో నేలపై దిగారు. సునీతా విలియమ్స్ తండ్రి గుజరాతీ. ఆయన పేరు దీపక్ పాండ్యా. మెహసానా జిల్లాలోని జులసాన్ సొంతూరు. సునీతా తల్లి పేరు ఉరుసులిన్ బొన్ని పాండ్యా. ఆమె స్లోవేనియా దేశస్థురాలు. ఓహియాలోని యూక్లిడ్లో సెప్టెంబర్ 19, 1965లో సునీతా జన్మించారు.
🚀 Welcome back, Sunita Williams! 🌍
Your safe return after an extended mission aboard the ISS is a remarkable achievement. A testament to NASA, SpaceX, and the USA’s commitment to space exploration! Your resilience and dedication continue to inspire space enthusiasts around the…
— ISRO (@isro) March 19, 2025