ఇజ్రాయెల్‌లో రికార్డు పోలింగ్
ప్రధాని నెతన్యాహు, ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ సైన్యాధిపతి ఐసెన్కోట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని సర్వేలు అంచనా వేస్తున్న తరుణంలో మంగళవారం ఇజ్రాయెల్‌లో జరిగిన కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 67 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- 50 ఏండ్లలో అత్యధిక ఓటింగ్
- నెతన్యాహుకు గట్టి పోటీ ఇస్తున్న మాజీ సైన్యాధిపతి ఐసెన్‌కోట్
జెరూసలెం : ప్రధాని నెతన్యాహు, ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ సైన్యాధిపతి ఐసెన్కోట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని సర్వేలు అంచనా వేస్తున్న తరుణంలో మంగళవారం ఇజ్రాయెల్‌లో జరిగిన కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 67 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1973 ఎన్నికల తర్వాత ఇదే అత్యధిక ఓటింగ్ శాతం. పోలింగ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10 గంటలకు ముగియనున్న ఈ ప్రక్రియలో 12,018 పోలింగ్ కేంద్రాల ద్వారా 73,31,981 మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇజ్రాయెల్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నెతన్యాహు, ఆయన భార్య సారా జెరూసలెంలోని ఒక పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. గట్టి పోటీని ఎదుర్కొంటున్న నెతన్యాహు ‘అరబ్ పార్టీల ప్రభుత్వం’ ఏర్పడకుండా ఉండేందుకు మితవాద ఓటర్లు మేల్కొని తన లికుడ్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. 2015 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఆయన మళ్లీ అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక స్పష్టమైన సంకేతం బుధవారం వెలువడే అవకాశం ఉంది. మీడియా కథనాల ప్రకారం సుమారు 80 వేల మంది ఇజ్రాయెలీలు ఓటేసేందుకు విదేశాల నుంచి వచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించగల ఎన్నికలుగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటు వేయడమే వారి రాకకు ప్రధాన కారణం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

