విద్యుత్తు కోతలతో రైతుల ఇక్కట్లు
సాగునీటి కొరత, విద్యుత్తు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన బొమ్మెర మహేందర్ అనే రైతు అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి మంగళవారం చెర్లపాలెలం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
- మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ
తొర్రూరు, అక్టోబర్ 27 : సాగునీటి కొరత, విద్యుత్తు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన బొమ్మెర మహేందర్ అనే రైతు అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి మంగళవారం చెర్లపాలెలం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేందర్ తన పొలంలో 13 బోర్లు వేసినా నీరు పడకపోవడం, బావి తవ్వినా విద్యుత్తు కోతలతో సరిగ్గా నీరందక పంటలు ఎండిపోయి నష్టాల పాలయ్యాడని తెలిపారు.
బలవంతంగా సంతకాలు
సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఎర్రబెల్లి విమర్శించారు. అమ్మాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తొర్రూరుకు వస్తున్న ఆయన వాహనాన్ని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆపి సమస్యలు వివరించారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో సెల్ఫ్ డిక్లరేషన్‌పై బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని విన్నవించారు.సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

