దాడులు ఆపితే 9500 కోట్లు ఇస్తాం!
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సౌదీ అరేబియా వారితో ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. తమ దేశంపై దాడి చేయకుండా ఉండేందుకు హౌతీ రెబల్స్‌కు రూ.9,500 కోట్లను ఇవ్వడానికి సౌదీ సిద్ధమైనట్టు తెలిసింది.
- హౌతీలకు సౌదీ బంపర్ ఆఫర్
రియాద్ : యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సౌదీ అరేబియా వారితో ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. తమ దేశంపై దాడి చేయకుండా ఉండేందుకు హౌతీ రెబల్స్‌కు రూ.9,500 కోట్లను ఇవ్వడానికి సౌదీ సిద్ధమైనట్టు తెలిసింది. సౌదీ రక్షణ శాఖ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఈ విషయమై చర్చలు జరపడానికి సోమవారం టెహ్రాన్‌కు చేరుకున్నారని మీడియా తెలిపింది. మంత్రి వినియోగించిన హెర్క్యులెస్ మిలిటరీ విమానంలోనే ఈ సొమ్ము తీసుకువచ్చినట్టు పేర్కొంది.
సౌదీ రక్షణ శాఖ భవనంపై క్షిపణి దాడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ భవనంపై బాలిస్టిక్ క్షిపణితో నేరుగా దాడి చేసినట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే ఈ వాదనను నిర్ధారించే ఆధారాలు లేవు. మరోవైపు, హౌతీలు ప్రయోగించిన రెండు క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తమ సైనిక బలగాలు రియాద్‌లోని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించాయని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. లక్ష్యాన్ని క్షిపణి నేరుగా తాకిందని పేర్కొన్నారు. అయితే ఈ దాడిలో రక్షణ శాఖ భవనానికి నష్టం వాటిల్లిందా? ప్రాణనష్టం జరిగిందా? అనే వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. మరోవైపు సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం రాస్ తనూరా రిఫైనరీపైనా క్షిపణి దాడి చేసినట్టు హౌతీలు ప్రకటించారు. ఈ దాడితో అక్కడ మంటలు చెలరేగినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

