బెంగాల్లో 24 గంటల్లో రెండు ఎన్కౌంటర్లు
బీజేపీ పాలిత పశ్చిమ బెంగాల్లో 24 గంట వ్యవధిలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. వేర్వేరుగా జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నిందితులిద్దరూ ఒకే విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించడం గమనార్హం.
కోల్‌కతా, అక్టోబర్ 27 : బీజేపీ పాలిత పశ్చిమ బెంగాల్లో 24 గంట వ్యవధిలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. వేర్వేరుగా జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నిందితులిద్దరూ ఒకే విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించడం గమనార్హం. ముర్షిదాబాద్ జిల్లా షంషేర్‌గంజ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్త సుజిత్ మండల్ హత్య కేసులో ఉన్న సమౌన్ షేక్ మంగళవారం, ఉత్తర పరగణాల జిల్లాలోని గమెఘాటాలో 17 ఏండ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై అరెస్టయిన ప్లహ్లాద్ దాస్ (23) సోమవారం అర్ధరాత్రి పోలీసు కాల్పుల్లో మరణించారు.
సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లగా పోలీసుల నుంచి రివాల్వర్ లాక్కోగా ఎదురు కాల్పుల్లో ఇద్దరూ మరణించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్లపై బెంగాల్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

