భద్రాచలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టా?
తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నది భౌగోళిక స్థితిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి జలాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి.
- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అజ్ఞానం
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నది భౌగోళిక స్థితిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి జలాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. మీడియాతో మాట్లాడిన ఎంపీ చామల, తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయనే వాదనలను ఖండించే క్రమంలో అవగాహనలేని వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు ఏపీకి పోతున్నాయని అంటుంటే.. కింద దేవాదుల ఉంది, అలాగే భద్రాచలం దగ్గర శ్రీరాంసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అకడ పంపులు నడుస్తున్నయ్’ అని పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉండే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎకడ? ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లోని భద్రాచలం ఎకడ? అని సాగునీటిరంగ నిపుణులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భద్రాచలం పరిసరాల్లో సీతారామ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులు ఉండగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏకంగా భద్రాచలానికి మార్చేస్తూ మాట్లాడటం ఎంపీ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. నదీ ప్రవాహ క్రమంలో ఎగువన ఉండే ప్రాజెక్టులు, దిగువన ఉండే పథకాల మధ్య తేడాలు, పంపుల వివరాలపై స్పష్టత లేకుండా ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే.. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సింది పోయి, తన సొంత అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నట్టు ఉన్నదని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

