గాంధీనగర్, నవంబర్ 28: గుజరాత్లో గ్రామ రక్షక్ దళ్(జీఆర్డీ)లో 600 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది. బనస్కతలోని పాలన్పూర్లో శనివారం నియామక ప్రక్రియ నిర్వహించారు. వేలాది అభ్యర్థులు రావడంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి నెలకొన్నది. పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ‘గుజరాత్ మోడల్ అని గొప్పగా చెప్పుకొంటారు. నిరుద్యోగంలో ఇదేనా గుజరాత్ మోడల్..?’ అని విపక్షాలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.