‘ప్రకృతి సిద్ధమైన సౌందర్య సాధనాలను వదిలిపెట్టి, రసాయన ఉత్పత్తులపై మోజు పెంచుకుంటూ శరీరాన్ని రోగాల కుప్పగా మార్చుకుంటున్నారు జనం. వీలైతే ఒక్కసారి వెదురు ఉత్పత్తులు ప్రయత్నించండి’ అంటూ సలహా ఇస్తున్నారు సౌందర్య నిపుణులు.
వెదురు సహజంగా పెరుగుతుంది. రసాయన ఎరువుల అవసరం ఉండదు. ఈ మొక్కలో 70 శాతం సిలికా ఉంటుంది. వెదురు ఉత్పత్తులు శరీరంలో కొల్లాజిన్ పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి.
వెదురు పదార్థాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖంపై ముడతలను తొలగిస్తాయి. నల్లమచ్చలు, మొటిమలను తగ్గించడంలో, మృతకణాలకు జీవం పోయడంలో కీలకంగా పనిచేస్తాయి.
జుట్టు, చర్మ సంరక్షణకు అద్భుతమైన పోషకం
వెదురులోని సిలికా. దీనివల్ల ఒంటికి నిగారింపు వస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వెదురులో అపారం. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.