హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఐఫోన్ల విక్రయ సంస్థ యాపిల్..హైదరాబాద్‌లో తన సొంత అవుట్‌లెట్‌ను తెరవబోతున్నది. ఇందుకోసం వేవ్‌రాక్ ఐటీ పార్క్‌లో 64,125 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నది. దీంతో మొత్తం లీజు 5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నది.
ఈ స్టోర్‌కు నెలకు రూ.80.15 లక్షల అద్దెను ఐదేండ్ల పాటు చెల్లించనున్నది. ఈ స్టోర్‌లో కంపెనీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను విక్రయించనున్నది.