న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశీయ మార్కెట్లోకి అతిపెద్ద టీవీ వచ్చేసింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ వోబ్లీ..116.5 ఇంచుల టెలివిజన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టీవీల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. 100 శాతం క్యూలెడ్ డిస్ప్లే+మినీలెడ్ డిస్ప్లే తయారైన గూగుల్ 5.0 టీవీ ఆండ్రాయిడ్ 14, 240 వాట్ల స్పీకర్ కలిగివుండటంతో థియేటర్లో చూసినట్టుగా ఉండనున్నదని కంపెనీ సీఈవో ఆనంద్ దూబే తెలిపారు.
అతిపెద్ద టీవీని తయారు చేయడం ఇబ్బందులతో కూడుకున్నదని, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. దీంతోపాటు 86 ఇంచులు, 98 ఇంచుల్లో కూడా టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.