ఐవోసీ రూ.5 మధ్యంతర డివిడెండ్

క్యూ2లో రూ.6,360 కోట్ల లాభం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,360.50 కోట్ల నికర లాభం లేదా ప్రతిషేరుకు రూ.6.93 ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,227.31 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.6.78తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో నమోదైన రూ.5,941.37 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గత త్రైమాసికంలో సంస్థ 19 మిలియన్ టన్నుల చమురును విక్రయించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 46% ఎగబాకి రూ.1.69 లక్షల కోట్లకు చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5 లేదా 50 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ఐవోసీ బోర్డు ప్రతిపాదించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Interim Dividend
- IOC
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

