సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహన్ని ధ్వంసం చేసిన ఉన్మాది సలీం బ్యాగ్రౌండ్‌ను తెలుసుకోవడంపై సిటీ పోలీసులు దృష్టి సారించారు. ఇతనిపై ముంబైలో ఇలాంటి ఘటనలకు సం బంధించిన రెండు కేసులు నమోదయ్యాయని గుర్తించిన పోలీసులు, ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడంపై దృష్టి పెట్టా రు. ఇందులో భాగంగానే ఎవరీ సలీం? అనే విషయంలో స్పష్టత కో సం ముంబైకి ప్రత్యేక బృందాలు వెళ్లా యి. అక్కడ పాత కేసులలోని పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు ఇత ని గత చర్రితను తవ్వేందుకు అవకాశాలున్నాయని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా, నిందితుడు నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు, అయి తే, పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలిసింది. ఉన్మాదిగా పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ వైద్య బృందాన్ని భయాందోళనకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అయితే, సాధారణం గా మతపరమైన దాడులు జరిగినప్పు డు ఉన్మాదిగా మారే వ్యక్తులు, దాడులకు పాల్పడే వారు మానసిక పరిస్థితి బాగోలేని వారేనని చివరకు తేలుతుం ది. ఈ ఘటనలోను అలాంటి పరిస్థితే ఉంటుందా? అనే అనుమానాలు సైతం నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నా రు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలలో దర్యాప్తు జరుపుతున్నామని త్వరలో అన్ని అంశాలతో స్పష్టత ఇస్తామంటూ నార్త్‌జోన్ డీసీపీ రష్మిపెరుమాల్ వెల్లడించారు.