మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘మహిళా బంధు కేసీఆర్’ కార్యక్రమం రెండోరోజు సోమవారం
ఆడపడుచుల ఆత్మీయత అనురాగాల మధ్య సంబురంగా సాగింది. ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్‌కాలనీ, సోమాజిగూడలోని బీఎస్‌మక్తాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి.. చెక్కులను అందజేశారు. వారితో కలిసి భోజనం చేశారు.
యూసుఫ్‌గూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ‘ఆడపడుచులతో ఆత్మీయ విందు’ నిర్వహించారు.
బంజారాహిల్స్, మార్చి 7: ‘అక్కా, అన్నా ఎలా ఉన్నావు? దీదీ, దాదా కైసే హై?’ అన్న ఆత్మీయ పలకరింపులు తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పలువురి నోట సోమవారం వినిపించాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఇండ్లు.. ఆత్మీయతానురాగాల లోగిళ్లు అయ్యా యి. పేదింటి ఆడపిల్లలకు వరప్రదాయినిగా కల్యాణ లక్ష్మి. షాదీ ముబారక్ పథకాలు పేరు సంపాదించుకున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధి పొందిన వారి ఇండ్లకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు అపూ ర్వ స్వాగతం లభించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న శైలజకు రెండునెలల క్రితం వివాహమైంది. పెళ్లి కోసం కల్యాణలక్ష్మి మంజూరవడంతో సోమవారం ఎమ్మెల్సీ కవిత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి లబ్ధిదారుల ఇం టికి వెళ్లి చెక్కును అందజేసి, వారితో కలిసి భోజనం చేశా రు. ‘అక్కా బాగున్నావా?’ అంటూ వారు ఆత్మీయంగా పలకరిస్తూ తమ ఇంట్లోకి వచ్చిన ఎమ్మెల్సీ కవితను చూసి న శైలజతో పాటు ఆమె తల్లి యాదమ్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఏం వంటలు చేశావంటూ ప్రశ్నించడం తో పాటు కలిసి భోంచేద్దామంటూ కవిత కోరారు. కొత్త పెళ్లి కూతురు శైలజ, తల్లి యాదమ్మతో కలిసి ఎమ్మెల్సీ కవి త, ఎమ్మెల్యే దానం నాగేందర్ భోజనం చేశారు. అనంత రం, వారితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, ఆడపిల్లలకు పెద్దన్న లాగా సీఎం కేసీఆ ర్ నిలుస్తూ పెళ్లికి సాయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కవిత, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్ పాల్గొన్నారు. అనంత రం, సోమాజిగూడ డివిజన్లోని బీఎస్ మక్తాలో షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిపొందిన వారి ఇంటికి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సం గీతా యాదవ్‌తో కలిసి వెళ్లారు. వారు అందించిన కుర్బానీ కా మీఠాను ఆరగించిన ఎమ్మెల్సీ కవితను ఇంటి యజమాని ఆశీర్వదించారు.
ఖైరతాబాద్, మార్చి 7: సోమాజిగూడ డివిజన్లోని బీఎస్ మక్తాలో ఎమ్మెల్సీ కవిత షాదీ ముబారక్ లబ్ధిదారులను కలిశారు. స్థానికంగా నివాసముండే మహమూద్ హుస్సేన్, ఫరీదా బేగం దంపతుల కుమార్తె అస్మా కౌసర్‌కు ఇటీవల వివాహం జరిగింది. వారికి షాదీ ముబారక్ పథకం కింద ప్రభుత్వ సాయం మంజూరు కాగా, ఎమ్మెల్సీ స్వయంగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా వారితో కొద్ది సేపు మాట్లాడారు. తన కుమార్తె పెండ్లి కోసం ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మహమూద్ హుస్సేన్ ఎమ్మెల్సీ కవితను ‘అల్లా చల్లగా చూడాలంటూ.. దువా’ ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఎస్కే అహ్మద్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ నారాయణమ్మ, నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, సలావుద్దీన్, రజినీ తదితరులు ఉన్నారు.