హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ) : బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో https:// mjptbcwreis.telangana.gov.in, https://mjpabcwreis.cgg. gov. in/TSMJBCWEB/ లో 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీతోపాటు రెగ్యులర్ గ్రూప్లతో పాటు అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ సూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేరొన్నారు.