టేక్మాల్: మండల కేంద్రమైన టేక్మాల్ ( Tekmal ) గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అపశృతి దొర్లింది. స్థానిక సర్పంచ్ సుధాకర్ జాతీయ జెండా ( National Flag ) ను తలకిందులుగా ఎగురవేయడం స్థానికంగా కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా పంచాయతీ ఆవరణలో జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో సర్పంచ్ సుధాకర్ ( Sarpanch Sudhakar ) జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో కాషాయం కిందికి, ఆకుపచ్చ పైకి ఉండేలా తలకిందులుగా ఎగురవేశారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు విస్మయానికి గురయ్యారు. పొరపాటును గమనించిన కొద్దిసేపటికే నిర్వాహకులు జెండాను దించి, సరైన క్రమంలో తిరిగి ఎగురవేశారు. జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, బాధ్యతయుతంగా వ్యవహారించా ల్సిన విషయంలో నిర్లక్ష్యం తగదని స్థానికులు పేర్కొన్నారు.