కాచిగూడ,ఏప్రిల్ 6 : సైబర్ నేరగాళ్లు కొత్త తరహ నేరాలకు పాల్పడుతున్నారని, వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సూచించారు. బర్కత్‌పుర హౌజింగ్‌బోర్డు పార్క్‌లో సైబర్ నేరగాళ్ల పట్ల కాలనీవాసులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా కాచిగూడ సీఐ హాజరై మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు ఆర్థిక పరమైన లావాదేవీల వివరాలు ఫోన్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని కోరారు.
మోసపూరితమైన యాప్‌లను నమ్మవద్దని, ఉద్యోగం కోసం గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు చెల్లించాలని అడిగితే అది మోసపూరితమైందని గుర్తించాలని సూచించారు.అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసిన.. మేసేజ్‌లు పంపినా 8712660540లో సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భరత్‌కుమార్, కాలనీవాసులు పాల్గొన్నారు.