ఆదిలాబాద్ : బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న రవాణా శాఖ కార్యాలయ భవనానికి ఆయన భూమి పూజ చేశారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు ఇతర ప్రధాన రంగాలను విస్మరించిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం చర్యలను నిరసిస్తూ బొగ్గుబాయి కార్మికులతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది ఆందోళనకు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి పేర్కొన్నారు.