కొల్లాపూర్, నవంబర్ 19: కాంగ్రెస్ విద్యార్థి విభాగం (ఎన్ఎస్యూసీ) నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఆదిరాల అన్వేష్గౌడ్, చిన్నంబావి మండలానికి చెందిన సీపీఎం జిల్లా నాయకుడు దేవేందర్ ఆదివారం కొల్లాపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సభా వేదికపై సీఎం కేసీఆర్ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు కొల్లాపూర్ నియోజకవర్గంలోని (జగదీశ్వర్‌రావు వర్గీయులు) వివిధ మండలాల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు 20మంది పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ మై నార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బాలపీరు, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్, పాన్‌గల్ మండల అధ్యక్షుడు ఎండీ నిరంజన్, వీపనగండ్ల మండల అధ్యక్షుడు ఎండీ.నజీర్, చిన్నంబావి మం డల అధ్యక్షుడు సయ్యద్ జాఫర్, కొల్లాపూర్ టౌన్ అధ్యక్షుడు జాహంగీర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహ్మద్, పెంట్లవెల్లి మండలం వర్కింగ్ ప్రెసిడెంగ్ రామకృష్ణగౌడ్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పస్పుల కురుమయ్య, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు చింతకుంట మధు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుట్టపాగ చిన్న రాముడు, నాగరాజు, లక్ష్మగౌడ్, నాగేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. తామంతా బీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం శ్రమించి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
అయిజ రూరల్ , నవంబర్ 19 : వడ్డెపల్లి మండలం శాంతినగర్ లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజ లు, కార్యకర్తలు, అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో సభ ప్రాంగణమంతా ఆశేష జనవాహినితో కి క్కిరిసిపోయింది. సీఎం కేసీఆర్ ప్ర సగిస్తుండగా సభాప్రాంగణమంతా కేరింతలు, ఈలలతో మార్మోగింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో కళకళలాడాయి.
మానవపాడు, నవంబర్ 19 : శాంతినగర్‌లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఈలలు కేరింతలతో సభా వేదిక దద్దరిల్లింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నిజాయితీ నిబద్ధతతో కూడిన వ్యక్తి అని ఇలాంటి నాయకుడు మీకు దొరకడం చాలా అదృష్టమని, పంటలు ఎండి పోతున్నాయని పట్టుబట్టి సాగునీటిని విడుదల చేయించుకున్నాడని చెప్పడంతో సభావేదిక ఒక్కసారిగా ఈలలు కేరింతలతో మార్మోగింది. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో సాగునీటి పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టుకూ సాగునీటిని అందిస్తామని చెప్పడంతో మరోసారి ఈలలు కేరింతలతో మార్మోగింది.
మానవపాడు, నవంబర్ 19 : అలంపూర్ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కళాకారులు తమ ఆటపాటలతో ఆల రించారు. ప్రజలు సభావేదిక చేరిన తర్వాత కళాకారులు ఏపూరి సోమన్న బృందం తెలంగాణ వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అబివృద్ధి పనులు, చేపట్టిన సంక్షేమ పథకాలను ఆట పాటలతో వివరించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కళాకారుల ఆటపాటలు అక్కడి వచ్చిన ప్రజలను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈలలు కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది.
మానవపాడు, నవంబర్ 19 : ఎన్ని ఇబ్బందులు ఉన్నా విధులు మాత్రం తప్పక చేయాల్సిందే. అది వయస్సు పైబడిన వారు అయినా సరే చంటిపిల్లలు ఉన్నా వారైనా సరే. ఆదివారం అలంపూర్ ని యోజకవర్గంలోని శాంతినగర్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద స భ నిర్వహించారు. ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి మహి ళా పోలీసులు విధులకు హాజర య్యారు. గద్వాల జిల్లాకు చెందిన చాముండేశ్వరికి శాంతి నగర్లో విధులు వేశారు. వే లాది మంది ప్రజల మధ్య చంకన చంటి బిడ్డను పెట్టుకొని విధులు నిర్వహించారు. ఒక వైపు ప్రజల తోపులాట, బిడ్డ ఏడుపులు లెక్క చేయకుండా విధులు నిర్వహించారు.
గత ప్రభుత్వ హయాంలో తాగు,సాగునీటి కోసం ఎంతగానో గోసపడ్డాం. కేసీఆర్ సీఎం అయ్యాక ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, అలాగే సమృద్ధిగా సాగునీరందిస్తూ మాకష్టా లు తీర్చిండు. ఆయన లాంటి నాయకుడిని చూడలేదు. ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు ఆయనే మళ్లీ మా సీఎం. దొంగలు ఎంత మొత్తుకున్నా కేసీఆరే సీఎం అయితీరుతాడు.
ప్రజలకు మేలు చేసే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ మేము కేసీఆర్ సారు సీఎం అయినాక అవన్నీ తొలగిపోయాయి.అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొంటాం. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకొంటాం
కేసీఆర్ సీఎం అయ్యాక రెండువేల పింఛన్ సకాలం లో అందిస్తున్నాడు. గతం లో వందల్లో ఉన్న పింఛన్ ఒక్క సారిగా పెంచి మా లాంటి పేదలను ఆదుకున్నాడు. ఆయన లాంటి నాయకుడు ఉం డాలి ఆయనను ఒకసారి చూసిపో దామని వచ్చి నా. ఆయన మళ్లీ సీఎం కావాలి. ఆయనకే మాఓ టు వేస్తాం ..
నాకు తొలిసారిగా ఓటు హక్కు వచ్చిం ది. నా ఓటు ప్రజల ఆ కాంక్షలను నెరవేరుస్తున్న బీఆర్ఎస్కు కేటాయించిన కారు గుర్తుపై వేస్తాను. నా చిన్నతనంలో మా అమ్మనాయన బతుకుదెరువు కోసం నన్ను మా అవ్వతాతల వద్ద వదిలి వలస వేళ్లేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించడంతో ఎన్నో ఏండ్లుగా పడావులో ఉన్న బీడు భూములు సాగులోకి వచ్చాయి. దీంతో వలసపోయిన నా తల్లిదండ్రులు తిరిగి మా ఊరికి వచ్చి ఉన్న మూడు ఎకరాల పొలంలో పంటలు పండిస్తున్నారు.. నా ఓటును కారు గుర్తుకు వేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటా..
ప్రతి క్షణం రాష్ట్ర అభివృద్ధి కో సం అహర్నిశలు కృషిచేస్తున్న సీ ఎం కేసీఆర్‌కు రుణపడి ఉం టాం. 70ఏండ్లుగా అభివృద్ధికి నోచుకొని గ్రామాలు కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ఈ ఎన్నికల్లో మా నియోజకవర్గ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డికి నా ఓటు తో పాటు, మా ఇంటిలిపాది ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తాం..
కేసీఆర్ సీఎం అయ్యాక అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిండు. ఈవిడుత కూడా కేసీఆర్‌ను సీఎం గా గెలిపించుకుంటాం. ఆయ న సీఎం అయ్యాక ముస్లింలకు షాదీముబారక్, పండుగ తోఫా, పిల్లలు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిండు. ఇలా అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తుండు అందుకే ఆయన మళ్లీ సీఎం కావాలి.
సీఎం కేసీఆర్ సార్‌కు మా రైతాంగం రుణపడి ఉంటుంది. గతంలో సాగుకు నీళ్లులేక పంట లు పండక అన్నదాతలు పట్టణాలకు వలసలు వెళ్లి గోస పడినం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకా ప్రాజెక్టులు నిర్మించి, సాగునీరు ఇస్తుండటంతో సొంత గ్రామాలకు వచ్చి పంటలు పండించుకుంటున్నాం. గతంలో రైతుల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు లేవు.. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సార్కే మా మద్దతు..
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌కు 2018 ఏడాదిలో మొదటిసా రి ఓటు వేశాను. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం రెండోసారి నాఓటును కారు గుర్తుపై వేస్తాను. మండలకేంద్రంలో ఉన్న యువత, ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి ఎమ్మెల్యే బీరంను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం..