హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : భారత్‌తో శ్రీలంక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకొంటున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ, సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ, జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భారత్, శ్రీలంక కళాకారుల యుద్ధ సన్నివేశాల నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉన్నదని గవర్నర్ ప్రశంసించారు. ప్రముఖ కళాకారిణి అంజనారాజపక్షే నేతృత్వంలో శ్రీలంక కళాకారులు ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో అలరించారు. గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ విశ్వకర్మ పాల్గొన్నారు.