వ్యవసాయ యూనివర్సిటీ/బిజినేపల్లి, అక్టోబర్ 28: ఇంటి బిల్లొస్తుంది.. మీకే ఇస్తామని బతిమిలాడి మరీ.. రాయి, ఇటుక , సిమెంట్ , మేస్త్రీలను అడుక్కుని గోడల వరకు కట్టాం. మా ఊర్లో కొంతమందికి ఇందిరమ్మ ఇంటి బిల్లులు వచ్చాయి, మాకెందుకు రాలేదని పైరవీకారులనడితే.. మీ నాన్న జైతెలంగాణ అంటాడనీ ఆపేశామన్నారంటూ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మమ్మాయపల్లికి చెందిన బాధిత దంపతులు చనమోని లలిత, మహేష్ బోరున విలపిస్తూ కన్నీరు పెట్టారు. అప్పులోళ్లు రోజూ గుడిసెవద్దకు వచ్చి నానా మాటలంటుండ్రు. ఎన్నికలపుడు ఓట్లు అడుక్కొని మాయమాటలు చెప్పి గ్యారెంటీ కార్డులిచ్చారు. నమ్మి ఓటేశాం, ఇప్పుడవి చెల్లవంటుండ్రు. రూ.2 లక్షల పైగా అప్పులయ్యాయి.