కొండాపూర్, అక్టోబర్ 28 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా.. అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీనగర్‌కు చెందిన సామల పాపిరెడ్డి బీహెచ్ఈఎల్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య లత, కుమారుడు నీరజ్‌రెడ్డి, కూతురు కీర్తన ఉన్నారు.
ఈ నెల 25న పాపిరెడ్డి జేపీనగర్ నుంచి సాధన స్కూల్ రోడ్డులో బైక్‌పై బీహెచ్ఈఎల్ వెళ్తుండగా.. నల్లగండ్ల వైపు నుంచి వచ్చిన మరో బైక్ (టీఎన్07 బీహెచ్5172) వెనక నుంచి ఢీకొట్టడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దవాఖానకు తరలించ గా చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడని వైద్యులు ధ్రువీకరించారు. అవయవదానం..
పాపిరెడ్డి అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కండ్లు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను జీవన్‌దాన్ ప్రతినిధులకు దానమిచ్చారు.