ఢిల్లీ : భారత టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ జోడీ మానుష్ షా, దివ్య చితలె కొత్త చరిత్ర సృష్టించారు. ఈ జంట ఈ ఏడాది ఆఖర్లో జరుగబోయే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. డబ్ల్యూటీటీ సిరీస్ ర్యాంకింగ్స్‌లో భారత జోడీ ఐదో స్థానంలో నిలిచింది.
ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానంలో ఉన్న జోడీలు ఫైనల్స్‌లో ఆడతాయి. ఫైనల్స్ పోరు డిసెంబర్ 10-14 మధ్య హాంకాంగ్, చైనా వేదికలుగా జరుగనుంది.