– హౌసింగ్ బోర్డు పీడీ రాజ్ కుమార్
కట్టంగూర్, ఫిబ్రవరి 21 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 758 ఇండ్లు మంజూరు అయ్యాయని అందులో ఒకటి పూర్తి కాగా బేస్మెంట్ లెవల్ 145, గోడల లెవల్ 107, స్లాబ్ లెవల్ 178, గ్రౌండ్ లెవల్ 437 ఇండ్లు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. మార్చి చివరి నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జీఓ నంబర్ 96 ప్రకారం గతంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు బెస్మెంట్ లెవల్లో ఉంటే మరలా నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.4 లక్షల ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట ఏఈ అరుణ, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్ ఉన్నారు.