ముంబై, మే 9 : గడిచిన కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.065 బిలియన్ డాలర్లు కరిగిపోయి 684.064 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితంవారంలో రిజర్వులు 1.983 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 514 మిలియన్ డాలర్లు పెరిగి 581.177 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ రిజర్వులు తరిగిపోవడం విశేషం. అలాగే గోల్డ్ రిజర్వులు 2.545 మిలియన్ డాలర్లు తగ్గి 81.82 బిలియన్ డాలర్లకు పరిమితమవగా, ఐఎంఎఫ్ వద్ద రిజర్వులు కూడా 4.509 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.