న్యూఢిల్లీ : టీకా డ్రైవ్‌లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 36కోట్లకుపైగా టీకాలు వేసిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందించిన నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 36,13,23,548 డోసులను 47,07,778 సెషన్ల ద్వారా అందించినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 36,05,998 మోతాదులు వేసినట్లు చెప్పింది. టీకా డ్రైవ్ మొదలైన నాటి నుంచి హెల్త్‌కేర్ వర్కర్లకు 1,02,36,072 2 మందికి మొదటి, మరో 73,43,749 మందికి రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,76,16,750 మందికి తొలి.. 97,45,413 మందికి రెండో మోతాదు వేసినట్లు చెప్పింది. 18-44 ఏజ్‌గ్రూప్‌లో 10,47,29,719 మందికి ఫస్ట్.. 30,47,880 మందికి రెండో మోతాదు అందించినట్లు తెలిపింది. 46-59 ఏజ్‌గ్రూప్‌లో 9,17,29,358 మందికి మొదటి.. 2,06,95,452 రెండో మోతాదు అందిందని పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు 6,93,94,933 మందికి తొలి.. 2,67,84,222 మందికి రెండో మోతాదు పంపిణీ చేసినట్లు వివరించింది.