దుబాయ్: గత నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ దక్కించుకుంది. అక్టోబర్‌లో ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో షెఫాలీ.. మరో ఓపెనర్ ప్రతీక రావల్ స్థానంలో వచ్చి ఫైనల్లో 87 రన్స్ చేయడమే గాక బంతితోనూ రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది.
పురుషుల విభాగంలో ఈ అవార్డు సౌతాఫ్రికా స్పిన్నర్ సిమన్ హర్మర్కు దక్కింది. గత నెలలో అతడు పాకిస్థాన్‌తో పాటు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించాడు.