హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్ఐ) స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ కర్రా శివానీ పతక జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే టోర్నీలో రజతం సొంతం చేసుకున్న శివానీ తాజాగా పసిడి పతకంతో మెరిసింది.
సోమవారం జరిగిన బాలికల అండర్-14 200మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ రేసును 2:29:30 సెకన్లతో ముగించిన శివానీ స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రిద్దిమా నెలకొల్పిన జాతీయ రికార్డు(2:29:75సె) రికార్డును శివానీ అధిగమించింది.