ఢిల్లీ: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్, ఇటీవలే ముగిసిన వరల్డ్కప్ ఫైనల్స్లో స్వర్ణం గెలిచిన సిమ్రన్ప్రీత్ కౌర్ నేషనల్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పసిడి పతకాలు గెలిచారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మను.. 36 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని నెగ్గగా కర్నాటకకు చెందిన దివ్య రజతం గెలిచింది.
ఇదే క్యాటగిరీ జూనియర్ విభాగంలో 21 ఏండ్ల సిమ్రన్ప్రీత్.. తన జోరును కొనసాగిస్తూ గోల్డ్ మెడల్ కొట్టింది. ఫైనన్లో ఆమె 39 పాయింట్లతో స్వర్ణం నెగ్గగా ప్రణవికి రజతం, పాలక్కు కాంస్యం దక్కాయి.