కింగ్డావో : బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ తొలి మ్యాచ్‌లో సత్తాచాటిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన మహిళల జట్టుతో పాటు పురుషుల విభాగంలోనూ ఓటములు ఎదురయ్యాయి. గ్రూప్-వైలో భారత్.. 2-3తో థాయ్‌లాండ్ చేతిలో ఓడింది.
తన్వి, గాయత్రి-త్రిసా ద్వయం వరుస మ్యాచ్‌ల్లో గెలిచినా తర్వాత రక్షిత రామ్రాజ్, తనీషా-శృతి, మాళవిక అపజయం పాలయ్యారు. గ్రూప్-సీలో భారత్.. 2-3తో జపాన్ చేతిలో పరాభవం పాలైంది. అయూశ్, సాత్విక్-చిరాగ్ జోడీ గెలుపుతో 2-0 ఆధిక్యాన్ని అందుకున్నా ప్రణయ్, హరిహరన్-పృథ్వీ ఓడటంతో స్కోర్లు 2-2తో సమమయ్యాయి. విజేతను నిర్దేశించే మూడో సింగిల్స్‌లో తరుణ్ పోరాడి ఓడటంతో జపాన్ విజేతగా నిలిచింది.