ఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫైనల్స్‌లో భారత ప్యాడ్లర్ల ద్వయం మనూష్ షా, దివ్య చిటాలాకు చుక్కెదురైంది. మిక్స్డ్ టీమ్ విభాగంలో తొలిసారిగా ఈ టోర్నీకి అర్హత సాధించిన భారత జోడీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడటంతో తదుపరి దశకు ముందంజ వేసే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్టే!
చైనాతో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జంట రెండో మ్యాచ్‌లో 2-3తో నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్స్ అయిన వాంగ్ చున్ టింగ్- డూ హోయి కెమ్ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడింది.