పనాజీ: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ భాగం కానున్నాడు. గోవా గార్డియన్స్ జట్టులో అతడు సహ యజమానిగా చేరాడు. హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 26 దాకా జరుగబోయే పీవీఎల్ నాలుగో సీజన్లో గోవా జట్టు అరంగేట్రం చేయనుంది.
కేఎల్ రాహుల్ కో ఓనర్ కాగా రాజు చేకూరి గోవా జట్టుకు వ్యవస్థాపకుడిగానే గాక యజమానిగానూ ఉన్నాడు.