న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతారాహిత్యమని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కోరుతూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆక్షేపించింది.
పైలట్ ఏ లేదా బీ బాధ్యులని రేపు ఎవరైనా బాధ్యతారహితంగా నిందిస్తే ఆ కుటుం బం క్షోభపడుతుందని, దర్యాప్తు పూర్తయ్యేవరకు గోప్యతను పాటించడం ముఖ్యమని జస్టిస్‌లు సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.