పెరుగుతున్న కరోనా కేసులు.. సైన్యం కీలక నిర్ణయం
భారత సైన్యం |

న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులను 50శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు తమకు కేటాయించిన సమయంలోనే కార్యాలయాలకు రావాలని, భౌతిక దూరంతో పాటు కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఇక సమావేశాలు వీలైనంత వరకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని చెప్పింది.
ఇదిలా ఉండగా.. పారామిలటరీ దళాల్లో కరోనా కేసులు గత పది రోజుల్లో ఐదు రెట్లు పెరిగాయి. ఏప్రిల్ 5న ఆర్డ్మ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన జవాన్ల సంఖ్య 522 ఉండగా.. ప్రస్తుతం 2,915కు చేరింది. మరో వైపు దేశంలో రోజువారీ కరోనా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 16,79,740 ఉన్నాయని, ఇప్పటి వరకు 1,75,649 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
నాగార్జునసాగర్‌లో ప్రారంభమైన పోలింగ్
పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
బెంగాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
మరోసారి పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన వర్మ..!
గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్!
ఢిల్లీలో రెండురోజుల్లోనే 1200లకుపైగా కంటైన్మెంట్ జోన్లు
వారాంతాల్లో భక్తులకు పూరీ జగన్నాథుడి దర్శనం నిలిపివేత
దేశంలో కొవిడ్ పరిస్థితిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు చర్చ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

