Army uniform: బ్రిగేడియర్లు, పైస్థాయి ఆఫీసర్లకు ఒకేరకమైన యూనిఫాం
Army uniform: బ్రిగేడియర్లు, ఆపై స్థాయి ఆఫీసర్లు ఇక నుంచి ఒకేరకమైన యూనిఫాంను ధరించనున్నట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఫ్లాగ్ ర్యాంక్ ఆఫీసర్లలో తేడా ఉండవద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్లో ఈ యునిఫాంపై నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: భారతీయ సైన్యం(Indian Army) కొత్త నిబంధన అమలు చేస్తోంది. బ్రిగేడియర్లతో పాటు ఆపై స్థాయి ర్యాంక్ అధికారులు ఇక నుంచి ఒకేరకమైన యూనిఫాం(Common Uniform)ను ధరించనున్నారు. పేరెంట్ క్యాడర్, అపాయింట్మెంట్తో సంబంధం లేకుండా ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కామన్ యూనిఫాం వల్ల సైన్యంలో వ్యత్యాసం ఉండదని, సంస్థలో సమానత్వం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు అవుతుందని ఆర్మీ పేర్కొన్నది. ఇటీవల జరిగిన ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్లో కామన్ యూనిఫాంపై నిర్ణయం తీసుకున్నారు.
హెడ్గియర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జీలు, గార్జెట్ ప్యాచ్లు, బెల్ట్లు, షూలు అన్నీ.. ఫ్లాగ్ ర్యాంక్ ఆఫీసర్లకు ఒకేలా ఉండనున్నాయి. ఆ ఆఫీసర్లు ఇక నుంచి ల్యాన్యార్డ్ను ధరించారు. ఒకేరకమైన గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సైన్యాధికారులు తెలిపారు. బ్రిగేడియర్, అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆఫీసర్లను ఫ్లాగ్ ర్యాంక్ ఆఫీసర్లంటారు. సాధారణంగా ఆ ఆఫీసర్లు యూనిట్లను, బెటాలియన్లను కమాండ్ చేస్తారు. ఎక్కువ శాతం హెడ్క్వార్టర్స్లోనే పోస్టింగ్ ఉంటుంది. అయితే కల్నల్స్ లేదా అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ల మూనిఫాంలో మాత్రం మార్పులేదని ఆర్మీ అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

