కాన్పూర్: టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు(Ind Vs Ban)లో సూపర్ విక్టరీ కొట్టింది ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఓపెనర్ జైస్వాల్ తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు తగ్గ క్రికెట్ స్ట్రోక్స్‌తో చెలరేగిపోతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 51 రన్స్ చేసి ఔటయ్యాడు. కోహ్లీ 29 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
2ND Test. India Won by 7 Wicket(s) https://t.co/VYXVdyNHMN #INDvBAN @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 1, 2024
అంతకుముందు ఇవాళ ఉదయం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 రన్స్‌కు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. జడేజా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి.. భారత గెలుపునకు బాటలు వేశాడు.అయిదో రోజు 26 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. కేవలం 146 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో ఇండియాకు స్వల్ప టార్గెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా చాలా డేరింగ్ గేమ్ ఆడింది. వాస్తవానికి వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దు అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా చాలా వేగంగా స్కోర్ చేసింది. నాలుగో రోజు ఫటా ఫటా రన్స్ రాబట్టింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్ కన్నా ఎక్కువ రన్స్ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. ఇక అయిదో రోజు అంతే వేగంగా బంగ్లా బ్యాటర్లను ఔట్ చేసి విజయానికి మార్గం సులువు చేసుకున్నది. భారత బౌలర్లు, బ్యాటర్లు.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించారు.