Mood of the Nation : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీ మళ్లీ సత్తా చాటనుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. కీలక హిందీ రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (యూపీ)లో కాషాయ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్ షేర్‌తో 80 స్ధానాలకు గాను 70 స్ధానాల్లో విజయం సాధిస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది.
2019 ఎన్నికల్లో బీజేపీ యూపీలో 62 స్ధానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షం అప్నాదళ్ 2 స్ధానాల్లో గెలుపొందింది. అన్ని లోక్‌సభ స్ధానాల్లో 35,801 మంది ఓటర్లను పలుకరిస్తూ మూడ్ ఆఫ్ ది నేషన్ ఫిబ్రవరి 2024 ఎడిషన్ సర్వే సాగింది. గత ఏడాది డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 28 మధ్య మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ నిర్వహించారు.
ఇక యూపీలో విపక్ష ఇండియా కూటమికి పది లోపు స్ధానాలే వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఎస్పీ 7 స్ధానాల్లో, కాంగ్రెస్ 1 స్ధానంలో విజయం సాధించవచ్చని పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ 15 స్ధానాలను గెలుచుకుంది. ఎస్పీ ఓట్ల శాతం 39 నుంచి 30 శాతానికి పడిపోతుందని సర్వే అంచనా వేసింది. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 8 శాతం ఓట్లను దక్కించుకుంటుందని పేర్కొంది.
Read More :
Tollywood | బడ్జెట్ కారణంగా ఆగిపోతున్న భారీ సినిమాలు.. మొహమాటం వదిలేస్తున్న నిర్మాతలు..!