దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. 73 రోజుల తర్వాత కనిష్ఠానికి రోజువారీ కేసులు చేరుకున్నాయని పేర్కొంది. కొత్తగా 88,977 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. మరో 1,587 మంది వైరస్ బారినపడి మృతి చెందారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. మొత్తం 2,85,80,647 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్ కేసులున్నాయని వివరించింది. టీకా డైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 26,89,60,399 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వరుసగా 36వ రోజు రోజువారీ కొత్త కేసులను రికవరీలు మించిపోయాయని చెప్పింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 96.03 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతాని కంటే తక్కువగా ఉందని, ప్రస్తుతం 3.80 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని.. వరుసగా 11వ రోజు శాతానికన్నా తక్కువగా ఉందని వివరించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38.71 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
ఢిల్లీ ఎయిమ్స్‌లో అందుబాటులోకి ఓపీడీ సేవలు
డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం : కేంద్రమంత్రి
ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీస్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

