దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆర్యోమంత్రిత్వ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆర్యోమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,07,628 మంది బాధితులు కొలుకోని డిశ్చార్జి అయ్యారు. మరో 2,542 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,33,105కు చేరగా.. ఇప్పటి వరకు 2,83,88,100 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 3,79,573 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 8,65,432 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది.
వరుసగా 34వ రోజు రోజువారీ రికవరీ కేసులు.. కొత్త కేసులను మించి పోయాయని, రికవరీ రేటు 95.80శాతానికి పెరిగిందని మంత్రిత్వశాఖ చెప్పింది. వ్లీకీ ప్లాజిటివిటీ రేటు ఐదు శాతానికి కన్నా తక్కువకు పడిపోయిందని, ప్రస్తుతం 4.17శాతంగా ఉందని.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.22శాతంగా ఉందని చెప్పింది. వరుసగా తొమ్మిదో రోజు ఐదో శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 38.33 కోట్ల కరోనా శాంపిల్స్ పరీక్షించామని, వ్యాక్సిన్ డ్రైవ్‌లో 26.19కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అమెరికాలో ఆరు లక్షలు దాటిన కరోనా మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

