e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి

విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కగరోల్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గోడకూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల్లో చిక్కుకున్న వారందరినీ రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారని, మృతుల్లో ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారని ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana