వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కు రీమేక్ ఇది. సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. వారం రోజుల్లో ఫస్ట్‌కాపీ సిద్ధం కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‘ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపిస్తారాయన. నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి నటించింది. వెంకటేష్ కెరీర్లో మరో గొప్ప సినిమాగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది’ అని చిత్రబృందం తెలిపింది. కార్తిక్త్న్రం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, సంగీతం: మణిశర్మ, కథ: వెట్రిమారన్.