చీలమండకు అండ!

నెలలు నిండేకొద్దీ గర్భిణులు బరువు పెరుగుతారు. ఆ భారం పాదాలపై పడుతుంది. చీలమండ దగ్గర వాపు, వేళ్లపై ఒత్తిడి ఏర్పడుతాయి. ఈ సమస్యను చిన్నచిన్న వ్యాయామాల ద్వారా అధిగమించవచ్చు. కాళ్లపై ఒత్తిడిని తగ్గించే ఈ వర్కవుట్లు ఎంతగానో ఉపశమనం కలిగిస్తాయి. అయితే, నిపుణుల సలహా తర్వాతే వీటిని ప్రయత్నించాలి.
- ముందుగా చాపమీద కూర్చోవాలి. కాళ్లు రెండూ ముందుకు చాపాలి. దీనిని ‘దండాసన స్థితి’ అంటారు. ఇప్పుడు, కాలి వేళ్లను ముందుకు స్ట్రెచ్ చేయాలి. చీలమండసహా పాదాలను వీలైనంత వరకూ ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఇలా 20 సార్లు ప్రయత్నించాలి.
- కాళ్లను దండాసన స్థితిలో ఉంచాలి. పాదాలను చీలమండసహా క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్‌గా రొటేట్ చేయాలి. ఇలా 20 సార్లు చేసి తిరిగి దండాసన స్థితికి రావాలి.
- ఇప్పుడు పాదాలను చీలమండనుంచి వేళ్లవరకు ముందుకు, వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఈ క్రమంలో ఎడమపాదాన్ని ముందుకు స్ట్రెచ్ చేసినప్పుడు కుడిపాదాన్ని వెనక్కి, కుడిపాదాన్ని ముందుకు అన్నప్పుడు ఎడమపాదాన్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా 20 సార్లు చేయాలి.
- మళ్లీ దండాసన స్థితిలోకి వచ్చిన తర్వాత మోకాళ్ల కింది భాగాన్ని చాపకు బాగా అదిమి ఉంచాలి. ఇలా 20 సార్లు చేసి కాళ్లను యథాస్థితికి తీసుకురావాలి. తర్వాత మోకాలి చిప్పను వెనక్కి నెడుతూ కాళ్లను స్ట్రెచ్ చేయాలి. ఇలా 20 సార్లు ప్రయత్నించాలి. చివరగా కాళ్లను వదులు చేసి ఎడమనుంచి కుడికి కదిలించి తిరిగి దండాసన స్థితికి రావాలి.
- దీనివల్ల కాళ్ల నొప్పులు, వేళ్లపై ఒత్తిడి తగ్గుతాయి. కాళ్లు రిలాక్స్ అవుతాయి. చీలమండ దగ్గర వాపు ఉంటే తగ్గుతుంది. అధిక రక్తపోటు, వాంతులు కావడం, తల తిరగడం వంటి సమస్యలు ఉన్నట్లయితే ప్రయత్నించొద్దు.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

