కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
దేశంలో కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు | గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్, నైట్‌కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం రోజువారీ కేసులు కాస్త తగ్గినా.. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా.. మరోసారి రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 2,51,857 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. ఇప్పటి వరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 1,97,894 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. మరో వైపు టీకా డ్రైవ్ చురుగ్గా సాగుతోంది.
ఇప్పటి వరకు 14,52,71,186 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కరోనా పరీక్షలు సైతం దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 16,58,700 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 28,09,79,877 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
ఎమ్మెస్సార్ మృతిపట్ల వినోద్ కుమార్ సంతాపం
జై తెలంగాణకు 17 ఏండ్లు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో వెంటిలేటర్ దొరక్క వైద్యుడి మృతి
కరోనాకు ‘పొగ’!
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

