derogatory remarks | ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వ్యాఖ్యలను (derogatory remarks) భారత్ ఆ దేశం దృష్టికి తీసుకువెళ్లింది.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వ్యాఖ్యలను (derogatory remarks) భారత్ ఆ దేశం దృష్టికి తీసుకువెళ్లింది. యువత సాధికారత డిప్యూటీ మంత్రి మరియం షియునా ప్రధాని లక్షద్వీప్ సందర్శించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మోదీపై వ్యంగ్యోక్తులకు తెగబడింది. మోదీని విదూషకుడని, తోలుబొమ్మ అంటూ ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో ఆపై సదరు పోస్ట్‌ను డిలీట్ చేసింది.
ప్రధాని లక్షద్వీప్‌లో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు ఫొటోలు షేర్ చేసిన అనంతరం మరియం షియునా మోదీ లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఆపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ట్వీట్లను డిలీట్ చేసింది. దీంతో మాల్దీవుల్లో భారత హై కమిషనర్ ఈ అంశాన్ని మహ్మద్ మిజు నేతృత్వంలోని మాలే సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ సైతం ప్రధాని మోదీపై మరియం షియునా అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె అసహ్యమైన పదజాలం వాడారని అన్నారు. మాల్దీవులకు కీలక భాగస్వామ్య దేశాధినేత పట్ల మంత్రి మరియం షియునా తీరు మాల్దీవుల భద్రత, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు.. మంత్రి వ్యాఖ్యల పట్ల మహ్మద్ మిజు ప్రభుత్వం దూరం పాటించాలని, ఆమె వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించేవి కాదని భారత్ సర్కార్‌కు స్పష్టం చేయాలని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.
Read More :
Student found Dead | ఇటలీలో విగతజీవిగా భారత విద్యార్ధి : మృతదేహాన్ని స్వస్ధలానికి తరలించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

