లండన్: ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ స్థానం కల్పించారు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కోహ్లీ ఆడనున్నాడు. పిచ్‌లో తేమ ఉందని, అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇటీవల ఫామ్‌లోని కోహ్లీ తొలి వన్డేలో ఆడలేదు. ఇక విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులోనూ కోహ్లీకి స్థానం దక్కలేదు. అతనికి రెస్ట్ ఇచ్చారు. అయితే ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేకు మాత్రం కోహ్లీకి ఛాన్స్ ఇచ్చారు.