IND vs ENG : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కల నిజమైంది. ఐపీఎల్- 19తో విధ్వంసక ఆటతో జాతీయ జట్టుకు ఎంపికైన ఈ చిచ్చరపిడుగు అంతర్జాతీయ అరంగేట్రానికి వేళైంది. ఇంగ్లండ్ పర్యటనతో అతడు టీమిండియా తరఫున టీ20లో అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నాడు. మాంచెస్టర్‌లో రెండో టీ20 టాస్కు ముందు తిలక్ వర్మ అతడికి డెబ్యూట్ క్యాప్ అందించాడు. అనంతరం ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు వైభవ్‌కు అభినందనలు తెలిపారు.
అభిమానుల ఎదురుచూపులు ఫలించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో అతడు డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాము ఒక మార్పుతో ఆడుతున్నామని చెప్పిన అయ్యర్.. సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తున్నామని పేర్కొన్నాడు.
The start of a special chapter ✨
A proud moment as Vaibhav Sooryavanshi receives his #TeamIndia cap from Vice-Captain Tilak Varma 🧢
Updates ▶️ https://t.co/WYfL8tAm58 #ENGvIND pic.twitter.com/zpLtixYDgM
— BCCI (@BCCI) July 4, 2026
భారత తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రానా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియాం డాసన్, ఆదిల్ రషీద్, ఆర్చర్, జోష్ టంగ్.