బూర్గంపహాడ్, జూలై 04 : బూర్గంపహాడ్ మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్ధినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి(సీడీపీవో) కేఎం తార శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నుండి నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, మండలంలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్ పోస్టుకు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పోస్టుకు స్థానికంగా ఉన్న మహిళలు అర్హులని, ఇంటర్, 10+2 పాసై ఉండాలని, 1.07.2026 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్లకు మించకుండా ఉండాలని పేర్కొన్నారు.