INDA vs SLA : రెండో అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ సాయి సుదర్శన్(168), దేవ్‌దత్ పడిక్కల్(94)లు శతక భాగస్వామ్యంతో బలమైన పునాది వేయగా మిడిలార్డర్లో ధ్రువ్ జురెల్(53), సరన్ష్ జైన్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. మూడో రోజు ఆరంభంలోనే వికెట్లు తీసిన శ్రీలంక ఏ బౌలర్లను విసిగించిన ఈ ద్వయం స్కోర్ నాలుగొందలు దాటించింది. షేక్ రషీద్(45) కూడా నిలబడడతో ఆట ముగిసే సరికి ఇండియా ఏ 8 వికెట్ల నష్టానికి 541 రన్స్ కొట్టింది.
శ్రీలంక పర్యటనలో భారత -ఏ జట్టు గర్వించదగ్గ ప్రదర్శన చేస్తోంది. రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లోనూ బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఐదొందలు కొట్టిన ఇండియా-ఏ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు లంక ఏ బౌలర్లను బెంబేలెత్తిస్తూ వరసగా రెండో శతకం బాదిన ఓపెనర్ సాయి సుదర్శన్(168) మూడో రోజు దంచాడు. కానీ, దేవ్‌దత్ పడిక్కల్(94) ఓవర్‌నైట్ స్కోర్ వద్దే వెనుదిరిగి సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్(13) రిటైర్డ్ హర్టవ్వగా.. ధ్రువ్ జురెల్(53) జతగా సాయి ఇన్నింగ్స్ నిర్మించాడు.
A productive batting day for India A as they extend their lead to 175 runs in the second four-day game against Sri Lanka A.
India A end Day 3 at 541 for 8.#SLAvINDA pic.twitter.com/EgrMXGybNo
— Cricbuzz (@cricbuzz) July 4, 2026
జోరుమీదున్న సాయిని డిల్హుం సుదీరా బౌల్డ్ చేసి లంకకు ఉపశనమిచ్చాడు. కానీ, ఆ తర్వాత సరాన్ష్ జైన్(68 నాటౌట్)తో క్రీజునంటుకున్న జురెల్ అర్ధ శతకంతో చెలరేగాడు. వీరిద్దరూ ఆతిథ్య బౌలర్లను కాచుకొని స్కోర్ నాలుగొందలు దాటించారు. కేశర నువంత(4-158) ధాటికి ఆఖర్లో వరసగా వికెట్లు పడినా.. షేక్ రషీద్(45), అకీబ్ నబీ(30)లు గొప్పగా ఆడారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-ఏ 8 వికెట్ల నష్టానికి 541 పరుగులు చేసిన భారత్.. 171 రన్స్ ఆధిక్యంలో నిలిచింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత -ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏను గొప్పగా కట్టి చేసింది. కెప్టెన్ సహన్ అరాచ్చిగా(127) శతకం బాదినా.. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. గుర్నూర్ బ్రార్, సరాన్ష్ జైన్ నాలుగేసి వికెట్లు తీయగా.. లంక నాలుగ్గొందలలోపే పరిమితమైంది. బ్రార్, జైన్ ధాటికి ఆతిథ్య లంక 366 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్ రెండు వికెట్లతో రాణించాడు.