పారిస్: పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఇండియా ఓటమి పాలైంది. 2-1 తేడాతో బెల్జియం స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. వాస్తవానికి ఆరంభంలో ఇండియానే ఆధిక్యంలో ఉన్నా.. టోక్యో మెడలిస్ట్ బెల్జియం అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. భారత్ తరపున అభిషేక్ ఒక్కడే గోల్ చేశాడు. తొలి రెండు క్వార్టర్లలో భారత్ దూకుడు ప్రదర్శించినా.. కీలకమైన చివరి రెండు క్వార్టర్స్‌లో బెల్జియం ఆటగాళ్లు జోరు పెంచారు. రాజ్ కుమార్ పాల్‌కు ఎల్లో కార్డు ఇవ్వడం వల్ల.. చివరి నిమిషాల్లో ఒక ఆటగాడు లేకుండానే ఇండియా ఆడాల్సి వచ్చింది.
𝐍𝐞𝐰𝐬 𝐅𝐥𝐚𝐬𝐡: 𝐈𝐧𝐝𝐢𝐚 𝐠𝐨 𝐝𝐨𝐰𝐧 𝐟𝐢𝐠𝐡𝐭𝐢𝐧𝐠 𝐭𝐨 𝐫𝐞𝐢𝐠𝐧𝐢𝐧𝐠 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐁𝐞𝐥𝐠𝐢𝐮𝐦 𝟏-𝟐 𝐢𝐧 𝐆𝐫𝐨𝐮𝐩 𝐬𝐭𝐚𝐠𝐞 𝐜𝐥𝐚𝐬𝐡.
Abhishek was the goal-scorer for India (field goal). #Hockey #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/m9EKAyZewN
— India_AllSports (@India_AllSports) August 1, 2024