లండన్: వచ్చే నెలలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సమయాలను ఒక గంట ముందుకు జరుపుతూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది.
ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసింది. దీని ప్రకారం తొలి, మూడో, నాలుగో టీ20లు గతంలో నిర్ణయించిన రాత్రి 11 గంటలకు కాకుండా.. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకే ప్రారంభం కానున్నాయి. రెండో, ఐదో టీ20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. జూలై 1,4,7,9, 11వ తేదీల్లో ఈ ఐదు టీ20లు జరుగుతాయి.