ఢిల్లీ: దుబాయ్‌లో జరిగిన బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా అండ్ మిడిల్ ఈస్ట్ టోర్నమెంట్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈనెల 10 నుంచి 18 దాకా జరిగిన టోర్నీలో భాగంగా.. భారత పురుషుల, మహిళల, సీనియర్ జట్టు స్వర్ణాలతో సత్తాచాటగా మిక్స్డ్ టీమ్ రజతం గెలిచింది. ఈ విజయంతో నాలుగు జట్లు.. ఈ ఏడాది ఆగస్టులో జరిగే 47వ బ్రిడ్జ్ చాంపియన్‌షిప్స్‌నకు అర్హత సాధించాయి.
కేకేఆర్‌లోకి నాయర్ రీఎంట్రీ
కోల్‌కతా: మూడు రోజుల క్రితం టీమ్ఇండియా కోచింగ్ బృందం నుంచి వైదొలిగిన అభిషేక్ నాయర్.. తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో చేరాడు. 2018 నుంచి గత సీజన్ వరకూ అభిషేక్.. కేకేఆర్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్న విషయం విదితమే. 2024లో టీమ్ఇండియా అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడైన నాయర్.. టెస్టులలో భారత జట్టు వైఫల్యాలతో బీసీసీఐ అతడిపై వేటు వేసింది. కోచింగ్ బృందం నుంచి తీసేసిన మూడు రోజుల తర్వాత అతడు మళ్లీ కేకేఆర్‌తో చేరడం గమనార్హం.